ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంచుతూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో మంత్రి భద్రత నిమిత్తం మరో 20 మంది పోలీసులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి హత్యకు కుట్ర వెలుగులోకి రావడంతో ఆయన భద్రత దృష్టా ఆరుగురు ఇంటెలిజెన్స్, 10 మంది సిటీ సెక్యూరిటీ వింగ్‌తో భద్రత కల్పించనున్నారు. అదేవిధంగా నలుగురు గ్రేహౌండ్స్ పోలీసులతో శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత కల్పించనున్నారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ తర్వాత శ్రీనివాస్‌గౌడ్‌కు గ్రేహౌండ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు. ఎం44 వెపన్స్‌తో గ్రేహౌండ్స్ పోలీసులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత కల్పించయడంతో పాటు ఆయన కాన్వాయ్‌లో మరో రెండు వాహనాలు పెంచారు. ఇటీవల సైబరాబాద్ పోలీసులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. మహబూబ్‌నగర్‌కు చెందిన మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు, ఆయన సోదరులు రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, నాగరాజు, మున్నూర్ రవి కలిసి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణ వెల్లడికావడంతో వారిని అరెస్ట్‌చేసి జైలుకు తరలించారు.