Sunday, January 19, 2025

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల తనిఖీ

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ః- విద్యార్థుల పట్ల,వారి చదువు పట్ల ఉపాధ్యాయులు గాని, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, హనుమకొండ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలానుసారము జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, హనుమకొండ కార్యదర్శి శ్రీనివాసులు హనుమకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వడ్డేపల్లి లోని పింగిళీ కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్శనలో కళాశాలలలోని విద్యార్థుల తరగతి గదులను, కళాశాల ఆవరణం, టాయిలెట్స్ తదితర ప్రదేశాలను పరిశీలించారు

. ఈ సందర్భంగా న్యాయమూర్తి టాయిలెట్స్, తరగతి గదులు, ఫ్యాన్స్ కళాశాల ఆవరణాన్ని పరిశీలించి, శుభ్రంగా ఉంచుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ కు, సిబ్బందికి తెలిపారు. కళాశాలలలో విద్యార్థి, విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయ సేవాధికార సంస్థల దృష్టికి తీసుకురావాలని, అప్పుడు న్యాయ సేవాధికార సంస్థలు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. హాస్టల్ లోని విద్యార్థులకు కల్తీ లేకుండా పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీకాంత్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు ధర్మేంద్ర, రాజారెడ్డి, చంద్ర మౌళి, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News