Sunday, December 22, 2024

ఉద్యానవనాల అభివృద్ధిలో అధికారుల నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

నిధులు మంజూరు చేసినా కొనసాగని పనులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన
పాపిరెడ్డినగర్ పార్కు
పార్కు కోసం ప్రజల నిరీక్షణ

Govt not development of parks

మనతెలంగాణ/ కూకట్‌పల్లి: అధికారుల నిర్లక్ష్యంతో ఉద్యానవనాలు అ భివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రజా ప్రతినిధులు కోట్లాది రూపాయ ల నిధులను కేటాయించి ఉద్యాన వనాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించినా అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుంది. ప్రజలకు అవసరమైన పార్కును ఆహ్లాదకరమై వాతావరణంతో తీర్చిదిద్దాలని ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న ప్రభుత్వ ఆదేశాలను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అదను గా కొన్ని ఉద్యానవనాలు కనుమరుగవుతున్నాయి. కూకట్‌పల్లి సర్కిల్ పరధిలోని కూకట్‌పల్లి డివిజన్‌లోగల బస్తీ దవాఖానా సమీపంలోగల పాపిరెడ్డినగర్, ఆస్‌బెస్టాస్‌కాలనీ అనుసంధానంగా ఉన్న ఉద్యానవనం అభివృద్ధి గత ఏడాదిగా నత్తనడకన సాగుతుంది. ఉదయం సా యంత్రం వేళల్లో చిన్నారులు, పెద్దలతో సందడిగా ఉండే పార్కు అభివృద్ధి పేరిట చేపడుతున్న పనులు ముందుకు సాగకపోవడంతో గత కొద్టి కాలంగా స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సుమారు పది పదిహేను కాలనీలు, బస్తీ వాసులు నిత్యం వాకింగ్, యోగా చేసుకునేందుకు గతంలో ఉద్యానవనం ఎంతగానో ఉపయోగపడేది. గత కొంతకాలంగా పార్కు తెరవక పోవడంతో వాకర్స్ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్ధితి నెలకొంటుంది. సగంసగం పనులతో చేతులు దులుపుకుంటున్న కాంట్రాక్టర్లను ప్రశ్నించే వారు కరువైయ్యారని స్ధానికులు వాపోతున్నారు. ఇదే అదునుగా పార్కు అసాంఘికా కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిత్యం పోకిరీలు చేరి గంజాయి, సిగరెట్లు, మధ్యం సేవిస్తూ అటుగా వెలుతున్న వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని స్ధానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికార, కాంట్రాక్టర్లకు నెత్తీ నోరు మొత్తుకుని చెబుతున్నా వారు పెడచెవిన పెట్టడంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. మరోమారు స్ధానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాదికారులు పూనుకుని పార్కును అభివృద్ధి పరచి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.

పార్కును వెంటనే అందుబాటులోకి తీసుకురావాలి
-శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ కూకట్‌పల్లి సీనియర్ నాయకుడు)
నిత్యం ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్దలు, చిన్నారులు సేదతీరితూ వాకింగ్, యోగాలతో కలకలలాడే ఉద్యానవనాన్ని అభివృద్ధి పేరిట చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతుండడంతో కళాహీనంగా మారింది. ప్రజలకు ఉపయోగపడే పార్కులను అభివృద్ధి పరిచి సకాలంలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే అదనుగా పోకీరీలు చేరి అసాంఘికా కార్యకలాపాలకు పాల్పడుతూ ఆ మార్గంలో ప్రయాణికులను, మహిళలకు ఇబ్బందులకు గురి చేస్తున్నరు. ఉన్నతాధికారులు పూనుకుని పార్కు పనులను త్వరలో పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

అధ్వానంగా తయారైంది : గంగుల రాజిరెడ్డి
(బిజెపి కూకట్‌పల్లి డివిజన్ ప్రధాన కార్యదర్శి)
స్ధానిక కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడే పా ర్కును అభివృద్ధి పేరిట తవ్వి వదిలివేయడంతో అధ్వానంగా తయారైంది. నిత్యం చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు కొంత సమయం సేదతీరేందుకు పార్కుకు వచ్చి వెల్లేవారు. గత ఏడాదిగా పార్కును అభివృద్ధి చేస్తామని నిధులు కేటాయించినా పనులు మాత్రం కొనసాగడం లేదు. కోట్లాది రూపాయం నిధులను అధికార, కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పనులు ప్రారంభించిన అనతి కాలంలోనె పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన కాంట్రాక్టర్లపై చ ర్యలు తీసుకునే నాథుడే కరువయ్యారు. ఉన్నతాధికారులు పూనుకుని పార్కు అభివృద్ధిని పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News