Monday, December 23, 2024

ఐటిఆర్ గడువు పొడిగింపు ఆలోచన లేదు: మల్హోత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆదాయ పన్ను చెల్లింపుదారులు జులై 31 గడవు తేదీ లోగా ఐటిఆర్(ఆదాయ పన్ను రిటర్న్) దాఖలు చేయాలని, ఆర్థిక మంత్రిత్వశాఖకు ఈ గడువును పొడిగించే ఆలోచన లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఫైలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. గతేడాది జులై 31 నాటికి మొత్తం 5.83 కోట్ల ఐటిఆర్‌లు దాఖలు చేశారు. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్(ఐటిఆర్)ని జూలై 31లోపు దాఖలు చేయాలి. ఈ గడువులోగా ఐటిఆర్ ఫైల్ చేయకపోతే రూ.5 వేల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News