Thursday, January 23, 2025

ప్రికాషన్ డోసుకు కాలవ్యవధి 9 నెలలే: కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కరోనా ప్రికాషన్ డోసు తీసుకునే కాలవ్యవధిని 9 నెలలే అని, ఈ వ్యవధిని తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. ఈ వ్యవధిని 6 నెలలకు తగ్గించాలంటూ గతంలో ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై కేంద్రం తగ్గించనున్నట్టు వార్తలు వచ్చాయని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యం లోనే కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు నేడు స్పందించాయి. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తరువాతే ముందు జాగ్రత్తగా డోసు వేయించుకోవాలని మరోసారి స్పష్టం చేశాయి. జనవరి 10 నుంచి దేశంలో మూడో డోసు పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్యకార్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వృద్ధులకు ప్రికాషన్ డోసు అందించారు. అయితే ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరూ ప్రికాషన్ డోసు వేయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ప్రైవేట్ కేంద్రాల ద్వారా ఈ డోసును పంపిణీ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News