Friday, December 20, 2024

సెల్ఫీకి బలి ?

- Advertisement -
- Advertisement -

రుద్రప్రయాగ : సిద్ధం అయి ఉన్న హెలికాప్టర్ సమీపంలో సెల్ఫీ తీసుకోవాలనే ఆరాటం ఉత్తరాఖండ్‌లో ఓ అధికారి దుర్మరణానికి దారి తీసింది. కేదార్‌నాథ్ యాత్రకు ఏర్పాట్లు పర్యవేక్షణకు విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగి ఫైనాన్స్ కంట్రోలర్ పోస్టులో ఉన్న అమిత్ సైనీ (35 ఏండ్లు) గర్హ్‌వాల్ మండల్ వికాస్ నిగమ్ హెలిపాడ్ వద్దకు రాగానే అక్కడున్న హెలికాప్టర్ రెక్కలు వచ్చి ఆయన మెడకు బలంగా తగిలాయి.

దీనితో ఆయనఅక్కడికక్కడే మృతి చెందారని రుద్రప్రయాగ్ జిల్లా అధికారి ప్రకటన వెలువరించారు. ఈ దుర్ఘటన మధ్యాహ్నం రెండుబావు ప్రాంతంలో జరిగింది. సెల్ఫీ దిగి వాట్సాప్ ద్వారా పంపించాలనే కంగారులో ఆయన పైన ఉన్న హెలికాప్టర్ రెక్కల గురించి పట్టించుకోలేదని వెల్లడైంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కేవలం ఆయన ప్రమాదవశాత్తూ మృతి చెందాడని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News