Saturday, November 23, 2024

అధికారులు అందుబాటులో ఉండాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Govt Officials duty in Heavy rains

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కెటిఆర్ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పిలతో ఫోన్ లో మాట్లాడారు. జిల్లాల్లో కురుస్తున్న వర్షాల పై ఆరా తీశారు.  అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.  పాఠశాలలకు సెలవు ప్రకటించినందున విద్యార్థులు బయటకి వచ్చే అవకాశం ఉండదని, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  మిడ్ మానేరు, అప్పర్ మానేరు, అనంతగిరి ప్రాజెక్టు, మానేరు నది వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు.

వేములవాడకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాలకు సెలవు ఉన్నందున దైవ దర్శనానికి భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.  ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్రత్యేకంగా వాగులపై రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, విద్యుత్, పోలీస్, ఆరోగ్య శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ముఖ్యంగా విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పూర్తి అప్రమత్తతో ఉండాలని, తెగిపోయిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంబాలు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద జాగ్రత్తగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News