Thursday, January 23, 2025

వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి సర్కార్ ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర భూములకు రైతుబంధు డబ్బులు తీసుకున్న లబ్దిదారులు తిరిగి ఇవ్వాలని నోటీసులు పంపించనుంది.

ఈ మేరకు సొమ్ము రికవరీకి సర్కార్ చర్యలు తీసుకోనున్నది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం రైతు యాదగిరిరెడ్డికి వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో 33 ఎకరాల భూమిని యాదగిరిరెడ్డి ప్లాట్లుగా వేసి విక్రయించారు. 33 ఎకరాల ప్లాట్లపై రూ.16 లక్షల వరకు రైతుబంధు డబ్బులు తీసుకున్నారు. ఆ మొత్తం తిగిరి చెల్లించాలని నోటీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News