Wednesday, January 22, 2025

బైజుస్ ఖాతా పుస్తకాల తనిఖీకి ప్రభుత్వం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎడ్ టెక్ సంస్థ బైజుస్ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేశారు. గత నెలలో కంపెనీ ఆడిటర్లు, అలాగే బోర్డు సభ్యులు రాజీనామా చేయడంతో అంతర్గత ఆర్థిక వ్యవహారాలపై దుమారం చెలరేగింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కంపెనీలో జరుగుతున్న వివాదాల దృష్టా ప్రభుత్వం ఈ కేసును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీ సమాచారంతో నిధులను సమీకరించాలని ప్రయత్నిస్తున్న బైజుస్‌కు కొత్త తలనొప్పి ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News