న్యూఢిల్లీ: కరోనా టీకాల దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ ప్యానెల్ దేశంలో వ్యాక్సిన్ తరువాత తొలి మరణాన్ని ధృవీకరించింది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరణించిన 31 మందిలో ఏయే దుష్ప్రభావాలు దాపురించాయో ప్రభుత్వ ప్యానెల్ కమిటీ అధ్యయనం చేసింది. వారిలో ఓ 68 ఏళ్ల వ్యక్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అనఫిలాక్సిస్ వల్ల చనిపోయినట్టు నిర్ధారించింది. వ్యాక్సినేషన్ తరువాత అనఫిలాక్స్ వల్ల చనిపోయిన మొదటి వ్యక్తిగా కమిటీ తేల్చింది. అనఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన ఎలర్జీ. మరో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వల్లనే చనిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ ఒక్క మరణాన్నే ధృవీకరించింది. వ్యాక్సిన్ సంబంధిత ఇలాంటి దుష్ప్రభావాలు ముందుగా ఊహించినవే అని ప్యానెల్ చెప్పింది. మరో ఇద్దరు వ్యాక్సిన్ తరువాత అనఫిలాక్సిస్ బారిన పడినప్పటికీ తరువాత వాళ్లు కోలుకోగలిగారు.
Govt Panel confirms first death in India after vaccination