Monday, December 23, 2024

త్వరలో భారత్-మయన్మార్ ఎఫ్‌ఎంఆర్ రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ సరిహద్దుల్లో 16 కిలోమీటర్ల వరకు ఎటువంటి వీసా లేకుండా స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించే ఒప్పందం(ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్) త్వరలోనే ముగియనున్నదని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. 643 కిలోమీటర్ల పొడవైన భారత్-మయన్మార్ సరిహద్దులు మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతాయి. ప్రస్తుతం ఈ ఒప్పందం ఈ సరిహద్దుల్లో అమలులో ఉంది. 2018లో భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది.

ఈ ఒప్పందం కింద భారత్ లేదా మయన్మార్ పౌరుడు, రెండు వైపులా 16 కిలోమీటర్ల పరిధిలో నివసించే గిరిజన తెగలకు చెందిన సభ్యుడు ఏడాది ర్చెల్లుబాటు అయ్యే సరిహద్దు పాస్‌ను చూపించి ప్రతి సందర్శనలోను రెండు వారాలపాటు ఏ వైపునైనా ఉండవచ్చు. త్వరలోనే ఇండో, మయన్మార్ మధ్య సరిహద్దుల పొడవునా ఫ్రీ మూవ్‌మెంట్ రిజైమ్(ఎఫ్‌ఎంఆర్)ను ముగించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో కంచె నిర్మాణం పూర్తవుతుందని, సరిహద్దులను దాటాలనుకునే ప్రతి ఒక్కరూ వీసా పొందవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News