హెచ్‌ఎండిఎ పరిధిలోని చెరువుల అభివృద్ధి సంరక్షణకు ప్రత్యేక చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్‌ఎండిఎ పరిధిలోని చెరు వుల అభివృద్ధి, సంరక్షణ కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. గండిపేట చెరు వు సుందరీకరణ, అభివృద్ధిపై మరింత దృష్టి సారించాలని మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు. హెచ్‌ఎండిఎ చేపట్టిన ప్రాజె క్టులపై మంత్రి కెటిఆర్ శనివారం నానక్‌రామ్ గూడలోని హైదరా బాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సమీక్ష సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండిఎ పరిధిలో చేపడు తున్న మౌలిక వసతులకు సంబంధించిన ప్రాజెక్టులు, భవిష్య త్ ప్రణాళికలకు సంబంధించిన తదితర అంశాలపై అధికా రులను ఆయన అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎండిఎ పరిధిలో ఉన్న చెరు వుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరు వుల అభివృద్ధి సుందరీకరణ కార్యకలాపాల నిర్వహణపై నిపుణులతో కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగర పరిధి లేదా హెచ్‌ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చెరువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగర పరిధి లేదా హెచ్‌ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు దీనికి అతీతం కాదనీ, హెచ్‌ఎండిఏ సైతం ఇప్పటికే అనేక చెరువులను వేగంగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ చెరువుల సంరక్షణకు సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కెటిఆర్ అధికారులతో పేర్కొన్నారు. హెచ్‌ఎండిఏతో పాటు జిహెచ్‌ఎంసి అనేక చెరువులను అభివృద్ధి చేస్తుందని, జిహెచ్‌ఎంసితో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని గండిపేట వంటి అతిపెద్ద చెరువుల వద్ద ఇప్పటికే అభివృద్ధి, సంరక్షణ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. గండిపేట సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆయన సూచించారు. ఇది నగర ప్రజలకు ఒక అద్భుతమైన చోటుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి
హెచ్‌ఎండిఏ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండిఏ భౌగోళిక పరిధిలో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్‌ఎండిఏ తన ఆస్తులను కట్టుదిట్టమైన భద్రతతో కాపాడే చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలో రేడియల్ రోడ్ల బలోపేతంతో పాటు మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జిల నిర్మాణం, హెచ్‌ఎండిఏ ల్యాండ్ ఫ్యూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప భవిష్యత్ కాలానికి హెచ్‌ఎండిఏ ప్రణాళిక వంటి వివిధ అంశాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష నిర్వహించారు.