Wednesday, January 22, 2025

మణిపూర్ హింసపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం: ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నిబంధనలు, సభాపతి అనుమతి మేరకు ప్రతి అంశాన్ని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమని బుధవారం అఖిలప పక్ష సమావేశంలో కేంద్రం తెలియచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో 32 శాసనపరమైన అంశాలు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

అంతకుముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన సభా కార్యకలాపాల కమిటీ సమావేశంలో ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన మణిపూర్ హింసాకాండ అంశాన్ని గురించి కూడా పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమేనని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News