Monday, December 23, 2024

రాహుల్‌కు మళ్లీ పాత బంగళా కేటాయింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి ఢిల్లీలో మళ్లీ పాత బంగళానే ప్రభుత్వం కేటాయించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన మరుసటి రోజే ప్రబుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ ఇంటిపేరు కేసులో సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన దరిమిలా రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది.

లోక్‌సభ సభభ్యత్వాన్ని కోల్పోయిన అనంతరం రాహుల్‌ను నంబర్ 12, తుగ్లక్ లేన్ నివాసం నుంచి లోక్‌సభ హౌస్ కమిటీ ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బంగళాను ఆయనకు తిరిగి కేటాయించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాహుల్ తన నివాసాన్ని ఖాళీ చేసి తన తల్లి సోనియా గాంధీ నివాసానికి తరలివెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News