Thursday, December 26, 2024

పంట నష్ట సాయం రూ.79కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం కింద బుధవారం నిధులు విడుదల చేసింది. సమగ్ర నివేదికల పరిశీలన అనంతరం మొత్తం రూ. 79.57కోట్లు విడుదల చేసింది.ఈ నిధులను నేరుగా 79216మంది రై తుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తోంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాల  వలన రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాలలో పంటనష్టం సంబవించినట్లు అధికారులు నిర్ధారించగా, దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంటనష్టపోయిన

రైతులకు పరిహారం కింద రూ. 79.57 కోట్ల నిధులు విడుదలయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అత్యధికంగా పంటనష్టం ఖమ్మం జిల్లాలో 28,407 ఎకరాలు, తరువాత మహబూబాబాద్ 14,669, సూర్యాపేట 9,828 ఎకరాలు సంబవించినట్టు ప్రభుత్వం నిర్ధారించింది. మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుండి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. పంటనష్ట పరిహారం కింద ఎకరానికి రూ.10 వేల చొప్పున నేరుగా రైతులకు చెందిన బ్యాంకు ఖాతాలలోనే జమ అయ్యేటట్లు అధికారులు తగిన ఏర్పాట్టు చేసినట్టు వ్యవసాయ ఉద్యాన శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News