- Advertisement -
న్యూఢిల్లీ: పౌరుల గోప్యతా హక్కులను కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తోందని కేంద్ర ఐటి, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కొత్త నిబంధనల గురించి వాట్సాప్ వినియోగదారులు భయపడాల్సిన అవసరం లేదని రవిశంకర్ ప్రసాద్ ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగం నియంత్రణకే కొత్త నిబంధనలను తీసుకొస్తున్నట్టు ఆయన తేల్చిచెప్పారు. విమర్శలను, ప్రశ్నించే హక్కును కూడా కేంద్రం స్వాగతిస్తుందని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయాలని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. తప్పుడు వార్తలు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.
Govt respects privacy Says Ravi Shankar Prasad
- Advertisement -