Monday, December 23, 2024

విద్యార్థితో అసభ్యకర చర్య.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెండ్

- Advertisement -
- Advertisement -

బల్లియా: యూపీ రాష్ట్రం బల్లియా జిల్లా రాస్రా బ్లాక్‌లోని ఒక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థితో అసభ్యకర చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలపై ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు. పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ దేవేంద్ర భారతిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని వారు తెలిపారు. తక్షణమే అమలులోకి వచ్చేలా శుక్రవారం భారతిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ప్రాథమిక విద్యా అధికారి మనీష్ కుమార్ సింగ్ తెలిపారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సూచన మేరకు సస్పెన్షన్‌ చేసినట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News