Monday, December 23, 2024

ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలను సిబిఎస్‌ఇకి మార్చాలి : ఐఎస్‌యు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ స్కూళ్లను, గురుకులాలను సిబిఎస్‌ఇ బోర్డుకు మార్చాలని ఇండియన్ విద్యార్థి సంఘం (ఐఎస్‌యు) జాతీయ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థలలో రాష్ట్ర బోర్డు సిలబస్‌ను చెప్పించడం, ప్రైవేటు విద్యాసంస్థలలో సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబి సిలబస్‌లను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే వారు పోటి పడడం కష్టమవుతోందని ఐఎస్‌యు జాతీయ అధ్యక్షులు పాపని నాగరాజు అన్నారు. అన్ని విద్యా సంస్థల్లో కామన్ సిలబస్‌గా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఐబిలను ప్రవేశ పెట్టడమే మేలని అన్నారు.

అందుకు ప్రభుత్వ విద్యాసంస్థల అధ్యాపకులకు తగు విధంగా తర్ఫిదు ఇచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యనందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అగ్రకుల, ధనిక వర్గ ప్రయోజనాల కోసం కాకుండా మెజారీటి ప్రజల సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడుతేనే రాజకీయ, ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ఐఎస్‌యు భావిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోదించే టీచర్లకు నైపుణ్యం, విజ్ఞానం మెండుగా ఉంటుందని, వారికి తగువిధమైన సౌకర్యాలు కల్పించక పోవడంతో పనిభారం అవుతుందన్నారు. మానిటరింగ్‌పై విద్యావంతులతో, అధికారులు, పాలకులు, ప్రజలు ఎప్పటికప్పుడు శ్రద్దతీసుకోవల్సిన అవసరం ఉందని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News