నల్లగొండ: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య విద్యారంగంలో మొదటి స్థానం తెలంగాణ రాష్ట్రానికి అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడ మండల కేంద్రంలోని హరిజనవాడలో విద్యా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి వ్యవసాయ రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గటల కరెంటును తెలంగాణ రాష్ట్ర ఇస్తుందని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా అడవిదేవులపల్లి హరిజనవాడలోని 17 లక్షల 21 వేల 664 రూపాయలతో మరమ్మతులు చేసి, మండల పరిషత్ పాఠశాలను ప్రారంభించారు.
పాఠశాల విద్యార్ధులతో కలిసి ఎమ్మెల్యే రాగిజావాను తాగారు. అనంతరం విద్యార్ధులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, నల్లగొండ రైతుబంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షురాలు కూరాకుల చినరామయ్య, ఆర్డీవో బి. చెన్నయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కొత్త మర్రెడ్డి, కోఆప్షన్ సభ్యులు బాబ్జాన్, బిఆర్‌ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.