Saturday, December 28, 2024

బిఎస్‌ఎన్‌ఎల్‌లో బిబిఎన్‌ఎల్ విలీనం!

- Advertisement -
- Advertisement -

Govt seeks to merge BharatNet with BSNL this month

ప్రభుత్వం యోచిస్తోంది: బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్)లో భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్‌ఎల్)ను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆల్ ఇండియా గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అండ్ టెలికామ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐజిఇటిఒఎ) నిర్వహించిన కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండి పి.కె.పుర్వార్ మాట్లాడుతూ, ప్రభుత్వం టెలికాం సంస్థలకు ప్రభుత్వం అద్భుతమైన అవకాశం ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌లో బిబిఎన్‌ఎల్‌ను విలీనం చేయాలనుకుంటోందని, అంటే బిబిఎన్‌ఎల్ ఇకపై బిఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి దేశవ్యాప్తంగా సేవలందించనుందని అన్నారు.

కేంద్ర టెలికాం మంత్రితో భేటీని పుర్వార్ గుర్తుచేస్తూ, విలీన అంశంపై మంత్రితో గంటపాటు సమావేశమయ్యామని అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే 6.8 లక్షల కి.మీటర్లకు పైగా నెట్‌వర్క్‌ను కల్గివుంది. విలీన ప్రతిపాదనతో బిఎస్‌ఎన్‌ఎల్ 5.67 కి.మీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను పొందనుంది. ఈ ఆప్టికల్ పైబర్‌తో దేశంలో 1.85 లక్షల గ్రామ పంచాయత్‌లకు యుఎస్‌ఒఎఫ్ (యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్)ను వినియోగించారు. 2012 ఫిబ్రవరిలో స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) బిబిఎన్‌ఎల్‌ను 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇది వివక్ష లేని ప్రతిపాదికన అన్ని టెలికామ్ ఆపరేటర్లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News