Wednesday, December 25, 2024

యువతకు శిక్షణ..ఉద్యోగ కల్పన రోజ్‌గార్ ఘనమని తెలిపిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :దేశంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు విధాలుగా ఉద్యోగాల అవకాశాలు కల్పించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సాంప్రదాయక రంగం, ఇదే విధంగా ఎదుగుతున్న రంగాలైన పునరుత్థాన ఇంధనం, రక్షణ పరిశ్రమలు, ఆటోమేషన్‌ల ద్వారా ఉద్యోగావకాశాలు బాగా మెరుగుపడ్డాయని ఆయన వివరించారు. ఇక్కడ శనివారం జరిగిన రోజ్‌గార్ కార్యక్రమంలో ప్రధాని మోడీ దాదాపు 51,000 మంది యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశారు.

తమ బిజెపి ప్రభుత్వం, మిత్రపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గత ఏడాది అక్టోబర్ నుంచి క్రమం తప్పకుండా రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తోందని ప్రధాని తెలిపారు. వీటి ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందించినట్లు గుర్తుచేశారు. యువత ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామని, రోజ్‌గార్ మేళాలు ఇందులో భాగమని తెలిపిన ప్రధాని మోడీ యువతకు తగు నైపుణ్య కల్పన కీలక అంశం అయిందన్నారు. వారికి వృత్తివిద్య సంబంధిత నైపుణ్య అందించడం ద్వారా అందివచ్చే అవకాశాలను చేజిక్కించుకునేందుకు అర్హులు చేయవచ్చునన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News