Wednesday, January 22, 2025

సిఇసి నియామక కమిటీ నుంచి సిజెఐ తొలగింపు: రాజ్యసభలో కేంద్రం బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సిజెఐ) స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును కేంద్రం ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘావల్ మధ్యాహ్నం భోజనం విరామం అనంతరం చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలెక్షన్ కమిషనర్స్(అపాయింట్‌మెంట్ కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ అర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

బిల్లులో పొందుపరిచిన అంశాల మేరకు..ప్రధాన మంత్రి సారథ్యంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ భవిత్తులో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది.
ఈ బిల్లుకు కాంగ్రెస్, ఆప్‌తోసహా అనేక ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకత తెలిపాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News