Thursday, January 23, 2025

డీప్‌ఫేక్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో మరోసారి భేటీ

- Advertisement -
- Advertisement -

చర్యలు తీసుకోవడానికి మరో వారం సమయం ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: డీప్ ఫేక్ సమస్యను ఎదుర్కోవడంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సాధించిన పురోగతిని సమీక్షించడం కోసం ప్రభుత్వం మంగలవారం ఆ సంస్థలతో మరో దఫా చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశారు. ఐటి నిబంధనల కింద ‘వినియోగదారులకు చేసేవి లేదా చట్ట వ్యతిరేకమైనవి’గా పేర్కొన్న 11 అంశాలు కూడా వాస్తవానికి భారత శిక్షాస్మృతి (ఐపిసి) కింద సమాన నిబంధనల కింద కూడా పేర్కొనబడ్డాయని, అందువల్ల ఈ చట్టాలకింద కూడా క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

డీప్‌ఫేక్స్‌లపై నిర్ణయాత్మక చర్యలను తీసుకోవడానికి కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గత నెల 24న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు చెందిన ప్రతినిధులతో సమావేశమై, ఐటి నిబంధనలకు అనుగుణంగా వాటిపై చర్య తీసుకోవడానికి వారం రోజలు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ సమావేశం తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ విషయంలో సాధించిన పురోగతిని సమీక్షించడం కోసం మంగళవారం మరోసారి సమావేశం నిర్వహించారు.

కాగా కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించగా, మరికొన్ని మాత్రం నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో వాటికి మరికొంత అదనపు సమయం ఇవ్వడం జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. పరిస్థితిని సమీక్షించడం కోసం మరో వారం రోజుల్లో తుది సమావేశం నిర్వహిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News