Wednesday, January 22, 2025

మూడు కోట్లు అప్పు చేసి పరారైన టీచర్

- Advertisement -
- Advertisement -

గద్వాల : టీచర్లు ,బంధువులు ,తెలిసిన వారి వద్ద మూడు కోట్లకు పైగా అప్పు చేసి ఓ ప్రభుత్వ టీచర్ పరారైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం అయిజ మండలం ఉప్పల్‌కు చెందిన ఓ టీచర్ గద్వాల మండలంలోని ఒక గ్రామంలో టీచరుగా విధులు నిర్వహిస్తున్నాడు. తోటి టీచర్లు, బంధువులు ఇతురలతో ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 8 లక్షల నుంచి 10 లక్షలు వరకు దాదాపు మొత్తం మూడు కోట్ల వరకు అప్పులు చేశాడు. ఒకరి దగ్గర చేసిన అప్పు మరొకరికి తెలియనీయకుండా తాను పని చేసే స్కూల్లోని టీచర్లతో నలుగురితో ఒక్కొక్కరి నుంచి పది లక్షల దాకా అప్పు చేసినట్లు తెలుస్తున్నది.

బూరెడ్డిపల్లెకు చెందిన ఒక వ్యక్తి నుంచి దాదాపు 30 లక్షలు అప్పు చేశాడు. వడ్డీ అసలు కట్టాలని ఒత్తిడి చెయ్యగా ఈ నెల 11వ తేదీన తిరుపతికి వెళ్లి సూసైడ్ అంటూ భార్యకు మెసెజ్ పెట్టడంతో అలర్ట్ అయిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి సూసైడ్ చేసుకోకుండా కాపాడినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత కర్నూల్‌లో ట్రీట్మెంట్ పొందాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అందుబాటులోకి రాకపోవడం, ఫోన్‌లో కూడా దొరకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇటీవలే కోటిన్నరతో రాజస్థాన్‌కి చెందిన బట్టల వ్యాపారి ఉడాయించిన ఘటన మరువక ముందే గద్వాల టౌన్‌లో మూడు కోట్లతో ఉడాయించిన టీచర్ వ్యవహరం వెలుగులోకి రావడం అప్పులు ఇచ్చిన వారిలో టెన్షన్ మొదలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News