Sunday, December 22, 2024

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఆత్మకూర్: పట్టణ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కరణ్‌లాల్(53) శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. కరణ్ లాల్ అమరచింత మండలం ఈర్లదిన్నె గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు రోజులుగా అనారోగ్యానికి గురైన కరణ్ లాల్ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

కరణ్‌లాల్ ఆకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, తోటి ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరయ్యారు. ఆయన మృతికి ఎంఈవో భాస్కర్ సింగ్‌తో పాటు తోటి ఉపాధ్యాయులు, మిత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News