Monday, January 20, 2025

శంషాబాద్‌లో హెల్త్ హబ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని దీనికో సం శంషాబాద్ దగ్గరలో 500ల నుంచి -1000 ఎకరాల్లో ఈ హబ్ ఏర్పాటుకు యో చిస్తున్నట్టు సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. హైదరాబాద్‌కు వస్తే జబ్బు నయమవుతుందనేలా చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూ రిజం హబ్‌లో బసవతారకం ఆసుపత్రికి స్థ లం కేటాయిస్తామని సిఎం రేవంత్ వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సం క్షేమం లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతాయని ఆ యన తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యా న్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవం త్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 24వ వార్షికోత్సవానికి బాలకృష్ణ ఆహ్వానించారని 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని ఆయనతో తెలిపానని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమా న్ని జ్యోతి ప్రజ్వలన చేసి సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచనతో ఏ ర్పడ్డ ఈ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషంగా ఉందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. పేదల కు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకున్నారన్నారు. ఎన్టీఆర్ ఆలోచన విధానాలను కొ నసాగించాలని చంద్రబాబు నాయుడు ఆ సుపత్రిని పూర్తి చేసి పేదలకు సేవలు అం దించేలా చేశారన్నారు. పేదలకు వైద్య సేవ లు అందించాలన్న ఎన్టీఆర్ ఆలోచనలు అమలవుతున్న
తీరు చూసి ఆయన మనల్ని స్వర్గం నుంచి ఆశీర్వదిస్తారన్నారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రాజకీయం, సంక్షేమం ఎన్టీఆర్ వారసత్వంగా ఇచ్చారని, ఎన్టీఆర్ మూడో తరం కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నానని సిఎం రేవంత్ తెలిపారు.

ఎన్టీఆర్ ఆలోచనను వారి కుటుంబ సభ్యులు కార్యరూపంలో …
ఎన్టీఆర్ ఆలోచనను వారి కుటుంబ సభ్యులు కార్యరూపంలో పెట్టారని సిఎం చెప్పారు. క్యాన్సర్‌ను అరికట్టాలన్నది తమ గొప్ప ఆలోచన అని సిఎం రేవంత్ అన్నారు. భవిష్యత్‌లోనూ బసవతారకం ఆస్పత్రికి తోడుంటామని ఆయన చెప్పారు. ఆస్పత్రి విస్తరణకు సహకరిస్తామన్నారు. నిత్యం ఎంతో మందికి ఆస్పత్రి సేవలందిస్తుందని సిఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపి నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు.

ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తాం: బాలకృష్ణ
క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తోందని బసవతారకం మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సిఎం సహకారం కోరామని ఆయన తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కోరిన వెంటనే అంగీకారం తెలిపారని బాలకృష్ణ వివరించారు. దాతల సహకారంతో ఆసుపత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News