- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు.
మొదటి విడత టమాటా దిగుమతులు శుక్రవారం నాటికి వారణాసి, లక్నా, కాన్పూర్ చేరుకుంటాయని గురువారం పార్లమెంట్‌లో మంత్రి ప్రకటించారు.
గత మూడు నెలలుగా దేశంలో టమాటా ధరలు దాదాపు 400 శాతం పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లోనే కిలో టమాటా ధర రూ. 140 మేరకు ఉంది. టమాటా దిగుబడి తగ్గడానికి వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తెగుళ్లు సోకడం వంటి కారణాలను రైతులు చూపుతుండగా టమాటా ధరలు సామాన్యుడికి భారంగా పెరిగిన పరిస్థితులలో టమాటాలను నేపాల్ నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Advertisement -