ఎల్లారెడ్డిపేట: గత తొమ్మిదేండ్ల కాలంలో కెసిఅర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెల్లి ప్రజలకు వివరించాలని జడ్పీటిసి చీటిలక్ష్మన్ రావు తెలిపారు. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న కెసిఅర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించి దేశానికి ఆదర్శవంతంగా నిలబెట్టారని అన్నారు.
ఆయన మంగళవారం నారాయణపూర్ , రాగట్లపల్లి గ్రామాల్లో ప్రజాప్రనిధులతో కలసి బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూపించి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని అన్నారు.
బూత్ కమిటీల సభ్యులు ప్రతి వంద మందికి ఒక్కరు చొప్పున ప్రచారం నిర్వహించి సిరిసిల్ల నియోజక వర్గంలో ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఅర్‌ను మరోసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందని సూచించారు. ఏడారిగ నిర్జీవ ప్రదేశంగా ఉన్న సిరిసిల్లను తొమ్మిదేండ్ల పాలనలో వంద శాతం అభివృద్ధి చేసి చూపించిన ఘనత అయనకే దక్కిందని తెలిపారు.
మండలంలో త్వరలో బూత్ కమిటీలను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గడపగడపకు ప్రచారం చేయుటకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించగలమని తెలిపారు. సామాజిక వర్గ విభేదాలకు తావు లేకుండ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్న విషయాన్ని అర్థం చేసుకేనేలా వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు.
కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస క్రిష్ణహరి ,ప్యాక్స్ చేర్మేన్ క్రిష్ణా రెడ్డి , నాయకులు అందె సుబాస్ , సర్పంచ్ స్వరూప మహేందర్ , గుల్లపల్లి నర్సింహ రెడ్డి , కుంబాల మల్లా రెడ్డి , బండారి బాల్ రెడ్డి , మీసం రాజం , రవి , పలువురు నాయకులు , కార్యక్తలు పాల్గోన్నారు.