Monday, December 23, 2024

నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా: విప్ బీర్ల ఐలయ్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తాను కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నానని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తనకు మంత్రి పదవి కావాలని సిఎంను అడిగానని దానికి సిఎం కూడా సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెప్పారు. గొల్ల,కుర్మలకు మంత్రిపదవి ఇవ్వాలని సిఎం, డిప్యూటీ సిఎం, మిగతా మంత్రులను కూడా కలిశానని ఆయన అన్నారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రిపదవులున్నాయని, భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ఒక్కరికీ లేదన్నారు. భువనగిరి నియోజకవర్గ పరిధిలో తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు ఆయన చెప్పారు. ఎన్నడూ గొల్ల,కుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదని ఐలయ్య గుర్తు చేశారు.

గొల్ల కుర్మల ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. గొల్ల,కుర్మలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైయిజర్ పోస్టు, ఐదు కార్పొరేషన్లు, పిసిసి చీఫ్ పోస్టు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిలో ముగ్గురికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారని అన్నారు. 50 లక్షల పై చిలుకు జనాభా వున్న గొల్ల,కుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరొచ్చినా చేర్చుకుంటామని ఆయన చెప్పారు. తనకు సిఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉందని, మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను ఆదుకుంది గొల్ల, కురుమలేనని కెసిఆర్ గొర్లుబర్లు ఇచ్చినా ఓడగొట్టారని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News