Wednesday, January 22, 2025

ఉద్యమ గళం సాయిచంద్‌కు నివాళులర్పించిన ప్రభుత్వ విప్

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట ః తన గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి తెలంగాణ మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తన పాట, మాటతో చైతన్యవంతులను చేసి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఆప్తమిత్రుడు సాయిచంద్ అకాల మరణం చాలా బాధాకరమని ప్రభుత్వ విప్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కొనియాడారు.

బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూసిన సాయిచంద్ మృతదేహాన్ని గురువారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయిచంద్ మరణం యావత్ తెలంగాణ రాష్ట్రానికి, కళాకారులకు ఎంతో తీరని లోటని, ఆ లోటును ఇక ఎవరు తీర్చలేరన్నారు. సాయి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, ఆయన ఆశయ సాధనకు కళాకారులు కృషి చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News