Monday, December 23, 2024

అంధుల రిజర్వేషన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది

- Advertisement -
- Advertisement -

లూయిస్ బ్రెయిలి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
లూయిస్ బ్రెయిలి జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క

మన తెలంగాణ / హైదరాబాద్ : అంధుల రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మలక్ పేట్ దివ్యాంగులు భవన్ లో లూయిస్ బ్రెయిలి 215వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలక్ పేట్ శాసనసభ్యులు బలాల, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ ,వికలాంగుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తో రూపొందించిన ల్యాప్ టాప్ లు , ఫోన్‌లను మంత్రి సీతక్క అంధులకు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్ళు లేనివారికి ప్రపంచాన్ని చూపించిన లూయిస్ బ్రెయిలి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. లూయిస్ బ్రెయిలి జీవితాన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లిపి కనుక్కోని కళ్ళు లేని వారికి బ్రెయిలి కనుచూపు అయ్యారని నివాళులర్పించారు. అవయవాలు లేవని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని,
చిన్న తనం లో కళ్ళు పొగోట్టుకుని సంఘర్షణ ద్వారా బ్రెయిలి లిపి కనుగొన్నాడని తెలిపారు. అంధులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారిస్తామని మంత్రి చెప్పారు. అంధులు బస్ స్టాప్ లలో సరైన విధంగా దిగేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేసేందుకు రవాణాశాఖ మంత్రి తో మాట్లాడుతానని మంత్రి హామినిచ్చారు. పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్ట్ ల భర్తీని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు.

Louis Braille 215 birth anniversary

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News