Friday, November 15, 2024

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయం: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మెట్రో రైలు విస్తరణ, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రోను నిర్మిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని చెప్పారు.  అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షిల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామని చెప్పారు.

గచ్చిబౌలి నుంచి మెట్రోలో విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని తెలిపారు. ఫార్మా సిటీ, ఆర్ఆర్ఆర్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని.. వీటి మధ్య పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్లు నిర్మిస్తామన్నారు. కార్మికులు హైదరాబాద్ వరకు రాకుండా క్లస్టర్లలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News