Saturday, January 11, 2025

ప్రతి ఇంటికి శ్రేష్ఠమైన నీరందించడమే ప్రభుత్వ లక్ష్యం : మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా తాగు, సాగు నీరందించడం ఒక్క తెలంగాణకే సాధ్యమైందని ముఖ్యంగా నగరంతో పాటు శివారు ప్రాంతాలలోనూ ప్రతి ఇంటికి నిరందించేందుకు కెసిఆర్ అపర భగీరథునిగా చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.

శనివారం అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్‌లోని వెంకన్న కాలనీ, ఎన్‌ఆర్ సాయి సూర్య ఎన్‌క్లేవ్ వద్ద రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ లైన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజేందర్‌నాథ్‌తో కలిసి పాల్గొన్నారు. ఇటీవల ఈ ప్రాంతాలలో తలెత్తిన ఒక్కో సమస్యను ప్రణాళిక ప్రకారం పురస్కరించడం జరుగుతుందని కార్పొరేటర్ రాజేంద్రనాథ్ తెలిపారు. హెచ్‌ఎం డబ్ల్యు ఎస్‌ఎస్ జిఎం సునీల్, డీజీఎం సాంబయ్య, మేనేజర్ సుజయ్, ఎస్ ఎస్ ప్రభాకర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, కాలనీ వాసులు, వివిధ ఇతర కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News