Thursday, January 23, 2025

ప్రభుత్వ ల క్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: ప్రభుత్వ ప్రాధాన్యత లక్షాలను త్వరితగతిన పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఎంపీడీఓలు, తహసీల్దారులు, పంచాయతీరాజ్ ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతికుమార్ సూచింన విధంగా ఐటీడీఏ ద్వారా పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని జిల్లాలో ఎరువులు, విత్తనాలు కొరత రాకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.

నూతన పట్టాదారుల బ్యాంకు వివరాలు సేకరించి అప్‌డేట్ చేయాలన్నారు. ప్రతీ నెల లక్షాలను నిర్దేశించుకుని సాధించాలని, ప్రభుత్వం గుర్తించిన భూమిని పట్టాలను అర్హులైన ఎంపికచేసి పంపిణీ చేయాలని, తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రామాల వారీగా మొక్కలు నాటేందుకు అవసరమైన మేర ఉపాధి హామీ పథకం కింద ఫిట్టింగ్ పనులు పూర్తి చేయాలని, మొక్కల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ అవెన్యూ ప్లాంటేషన్ మొక్కకు టీ గార్డ్ ఏర్పాటుచేయాలని, నాటిన ప్రతీ మొక్క లెక్క పక్కాగా ఉండేందుకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు.

బీసీ కుల వృత్తుల వారికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రూ. లక్ష ఆర్థికసాయం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల ఎంపిక పారదర్శంగా ఆన్‌లైన్ చేయాలని, బీసీ వృత్తులు దరఖాస్తుల పరిశీలన అర్హుల ఎంపిక ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలన్నారు. అలాగే ప్రతీ గ్రామపంచాయతీలోని వైకుంఠధామాల్లో కరంటు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలన్నారు. గ్రామాల్లోని సమస్యల్ని వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని, పనులు ఆగకుండా చూడాలని, వచ్చే సోమవారం నాటికి పూర్తిస్థాయిలో ప్రగతి సాధించాలన్నారు. ప్రతీ మండలంలో అనుకున్న దాని కంటే తక్కువ స్థాయిలో ప్రగతి పనులు నడుస్తున్నాయని సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని, మిషన్ భగీరథ ద్వారా మండలంలోని గ్రామాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందున ప్రతీ గ్రామంలో మంచినీటి బోరు వేయించడానికి సంబంధిత ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీలు, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News