Monday, December 23, 2024

గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గౌలిదొడ్డి గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాల
ఔట్ సోర్సింగ్ లో పనిచేసిన 18 మంది అధ్యాపకులను సొసైటీ తొలగించింది. బోధన సక్రమంగా జరగకపోవడంతో  ఐఐటి, నీట్ పాత ఫ్యాకల్టీ కావాలని కళాశాల గేటుముందు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఉన్నపళంగా అధ్యాపకులు తొలగించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ లో గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐఐటి, మెడిసిన్ లో అత్యధికంగా చేరిన వారిలో గౌలిదొడ్డి విద్యార్దులు ఎక్కువగా ఉన్నారు. ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఉపాధ్యాయులు కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.  దాదాపుగా 22 మంది ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీని అధికారులు తొలగించారు. వారి స్థానంలో కొత్తగా ప్రభుత్వం ఉపాధ్యాయులను అధికారులు నియమించారు. వారికి ఐఐటి, నీట్ సిలబస్ చెప్పడం రావడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News