Sunday, January 5, 2025

జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక : ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేయాలని సిఐటియూ మండల నాయకులు సాధిక్ అన్నారు. గురువారం ఉమ్మడి దుబ్బాక మండల పరిధిలోని 30 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులు వారి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెబాట చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియూ మండల నాయకులు ఎండి. సాధిక్ కార్మికులకు మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ సిబ్బందిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జీవో ప్రకారం వేతనాలను పెంచాలని ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీల్లో వారికి సేవలను అందిస్తున్న వారి సమస్యలను పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీల్లో పని చేసేందుకు కార్మికులు కావాలి కానీ బాగోగులు మాత్రం పట్టవా అని మండిపడ్డారు. జీవో ప్రకారం గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులందరికి న్యాయం చేసే వరకు ప్రజా సంఘాల ఆద్వర్యంలో తాము ఉత్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రశాంత్, శ్రీను, రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్‌లో.. గ్రామ పంచాయతీ కార్మికులకు 11 వ పిఆర్సి ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని మల్టీ పర్సస్ విధానం రద్దు చేయాలని సీఐటియూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9500 వేతనం ఇస్తూ వెట్టి చాకిరి చేయించడం జరుగుతుందన్నారు.
పెరుగుతున్న నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రభుత్వం ఇచ్చే వేతనాలు సరిపడక ప్రతి నెల అప్పులు చేస్తూ జీవనం కొనసాగించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలో 99 శాతం పని చేస్తుంది. దళితులేనన్నారు. గ్రామ ప్రజలందరు బాగుండాలని గ్రామాలన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చిన కార్మికులకు మాత్రం ఒరిగింది ఏమి లేదని ఏద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి కార్మికుందరికి 19 వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని డిమాండ్ చేశారు.
కార్మికులందరికి బీమా సౌకర్యం కల్పించి ప్రతి నెల సబ్బులు, నూనెలు , ఈ ఎస్‌ఐ , పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు పండగ సెలవు ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ నాయకులు వెంకటచారి, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ఉపాద్యక్షులు నర్సింలు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కనకవ్వ, యాదగిరి, నాయకులు నాగరాజు, మల్లేశ్, మైసయ్య, రేణుక, అనిల్ ,సత్యం, హరికిషన్, బాబు, రవి, లచ్చవ్వ, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News