Wednesday, January 22, 2025

జిపి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : గ్రామపంచాయితీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా అద్యక్షులు ఆకుల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయితీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత ఆరురోజులుగా చేపట్టిన సమ్మె శిభిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజు మాట్లాడుతూ.. మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. వ్యక్తిగత భీమా సౌకర్యం కల్పించాలని, ఈఎస్‌ఐ,కేఎఫ్సి అవగాహన కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సంఘం నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, సుధాకర్,అశోక్, వీరన్న, విజయ్,వరేందర్, వెంకన్న, మునేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలు అమలుచేయాలని సిఐటియు జిల్లా అద్యక్షులు ఆకుల రాజు కోరారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన దీక్షా శిభిరాన్ని సందర్శించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, వేముల సృజన యాకమ్మ, రాధిక, మమత, రేణుకర, సుజాత, శైలజ, మైబూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News