Friday, December 27, 2024

6 నుంచి జిపి కార్మికుల సమ్మె : ఎస్‌కె.సాబీర్‌పాషా

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : జూలై 6 నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌పాషా పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శేషగిరి భవన్‌లో నిర్వహించిన గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామల అభివృద్ధి, పరిశుభ్రం చేస్తూ రెక్కలు ముక్కలు చేస్తూ అశిద్దాన్ని సైతం అన్నం తినే చేత్తో ఎత్తి పారివేస్తున్న కార్మికుల కనీస వేతన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన 26 వేలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

అనంతరం ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ జూలై 6 నుంచి జేఏసి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం అన్ని రకాల పనులు బంద్ చేస్తూ సమ్మె పిలుపు మేరకు జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలో ఎంపివో, డిపివోలకు సమ్మె నోటీస్ అందించామని తెలిపారు. బిఆర్‌ఎస్ అనుబంధ సంఘాలతో పాటు ఏఐటియుసి,సిఐటియు, ఇప్టూ ఇతర సంఘాల మద్దతుతో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనం26500, ఇన్సూరెన్స్ 10 లక్షలు, పిఎఫ్, గ్రాడ్యుటీ 10 లక్షలు, పెన్షన్ 10 వేలు , హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసూఫ్, సురేష్, కిషోర్, మంజుల, సారయ్య, సున్నం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News