Tuesday, January 21, 2025

సామాజిక భద్రత లేని జీపి కార్మికులు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:చాలీచాలని వేతనాలతో గ్రామ పంచాయితీ కా ర్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ము ందు 28వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మెను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గ్రామ పంచాయితీ కార్మికులకు హామీ ఇచ్చి 9సంవత్సరాలైనా పర్మినెంట్ చేయకపోవడం భాదాకరమన్నారు.జీవో నెంబర్ 60ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 50వేల కుటుంబాలు నెలల తరబడి పెండింగ్ బిల్లుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.జీపి కార్మికులకు గౌరవ వేతనం రూ.19,600లు ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని,మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీలు అభివృద్ది చెందాలంటే కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌కె యాకూబ్, గోపగాని సత్యం, కొండ సైదులు, రమేష్,రాజు, జానయ్య, గోపి,లింగమ్మ, కనకమ్మ, నాగమణి,నాగేంద్ర, నాగచారి, వెంకన్న,శ్రీను,కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News