Monday, January 20, 2025

నెక్ట్స్ వేవ్‌లో జిపిసి రూ.275 కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన నెక్ట్స్ వేవ్ తాజా ఫండింగ్ రౌండ్‌లో రూ.275 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. ఈ రౌండ్‌కి అగ్రగామి అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్ధ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ (జిపిసి) నేతృత్వం వహించింది. నెక్ట్స్ వేవ్ ప్రస్తుత వెంచర్ ఇన్వెస్టర్ ఓరియోస్ వెంచర్ పార్టనర్స్ కూడా ఈ రౌండ్ లో పాల్గొంది. నెక్ట్స్ వేవ్ ని స్థాపించిన ఫౌండర్లు తెలుగు వారే. ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐఐటి హైదరాబాద్ పూర్వ విద్యార్ధులు – శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్ల, రాహుల్ అట్లూరి ఈ కంపెనీని స్థాపించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News