Monday, January 20, 2025

పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ వాహనాలకు జీపీఎస్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్‌లో అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ఈమేరకు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్టు చెప్పారు.

“ ఈవిఎం సహా ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే సమయంలో.. ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకొచ్చేవరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నాం. తద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం” అని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. ఒకవేళ ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైవర్లు సహా పోలింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామని తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News