Monday, December 23, 2024

గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్

- Advertisement -
- Advertisement -

ఇద్దరు ఆడ పిలకాయలు రమేషా..? నివ్వు లేకుండా ఎట్ట సాకేది !? దుబాయ్‌కు పోబాకు. ఈడనే ఏదన్నా చూసుకో రమేషా..?’ అంటూ ఆ ఇల్లాలు ఏడుస్తోంది./ రమేష్‌కు మాట పెగల్టల్లేదు. కళ్ళలో నీళ్ళు ఉబికి వస్తున్నా, దిగమింగుకుంటున్నాడు. మొగవాడు కదా, పైకి ఏడవకూడదు!/ “నువ్వు గమ్మునుండుమే’ అంటున్నాడు తలొంచుకుని పైకి మేకపులి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ./ ఏం జరుగుతోందో అర్థం కాక ఆ ఇద్దరు పిల్లలు చుట్టూ చేరిన బంధువుల ముఖాలు చూస్తున్నారు. రమేష్ బ్యాగ్ పుచ్చుకుని తలొంచుకుని వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు.

నాలుగేళ్ళ క్రితం మా ఇంటి దగ్గర జరిగిన సంఘటన ఇది. ఆటో రమేష్ భార్యా బిడ్డలను ఒదిలేసి దుబాయ్‌కి ఎందుకెళ్ళిపోతున్నాడు!? తిరుపతికి కొత్త ఎస్పీ వచ్చాడు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో షేర్ ఆటోలను నిషేధించాడు. షేర్ ఆటోలు ఆగిపోయాయి. వాటిపైన ఆధారపడిన బతుకులూ ఆగిపోయాయి. వాటిని అమ్ముదామంటే ఎవ్వరూ కొనడం లేదు. వాటిని తిరగనిస్తే కదా ఎవరైనా కొనడానికి!? తెల్లారకముందే పోలీసుల కంట పడకుండా తిరుపతి ఒదిలేసి, పల్లెల్లో తిప్పుకుని, ఎప్పుడో చీకటి పడ్డాక దొంగతనంగా ఊర్లోకి రావాలి. పోలీసుల కంట పడితే అంతే; బూతులు, లాఠీ దెబ్బలు, పెనాల్టీలు. తిరుపతిలో సిటీ బస్సులు లేవు. సిటీ బస్సులే ఉంటే షేర్ ఆటోలను ఎందుకు ఎక్కుతారు!? అప్పు చేసి కొత్త ఆటో కొనేకంటే దుబా్‌ు వెళ్లడం మేలనుకున్నాడు రమేష్.

ఆటో కార్మికుల కథలు, వెతలు లెక్కలేనన్ని ఉన్నాయి. అవి బైటికి రావడం లేదు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ గోవిందరాజు చక్రధర్ డిగ్రీ పూర్తి చేశాక, ఎలాంటి భేషజాలకు పోకుం డా, మూడేళ్ళ పాటు గుంటూరులో ఆటో కార్మికుడిగా గడిపిన జీవితాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉద్యోగం రాలేదని చింతించకుండా బ్యాంకు లోన్ తీసుకుని రెండు ఆటోలు కొన్నా రు. రౌడీలు, రాబందులు, వ్యభిచారులు, మోసగాళ్ళ నుంచి, మానవత్వం పరిమళించే మహానుభావుల వరకు, వారి గురించి తాను పొందిన అ నుభవాలు, జ్ఞాపకాలు, ఆనందాలు, విషాదాలు, జీవిత పాఠాలతో ‘గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్’ అన్న పుస్తకం రాశారు. ఆటో కార్మికుడిగా గడిపిన జీవితంలో ఎక్కడా దాపరికాలు లేవు. పత్రి కా రంగంలో చేరే వరకు ఆటో కార్మికుడిగానే కొనసాగారు. ఈ లోగా ఎం.ఏ., పూర్తి చేశారు. ఆటోలను పూర్తిగా డ్రైవర్లకు ఇవ్వకుండా, వాటి యజమానిగా తాను కూడా ఆటో నడిపే వారు. డ్రైవర్లకు చిన్న మూర, పెద్ద మూర, బొబ్బట్లు, బెల్‌బాటవ్‌ు వంటి ముద్దు పేర్ల పలుకుబడుల వెనుక ఉన్న కథలను వివరించారు.

ఆటో పైన ‘అన్ ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్’ అని ఇంగ్లీషులో రాసుకున్నారు. మిగతావారితో పోల్చుకుంటే కాస్త మర్యాద గౌరవం పెరిగింది. గ్రాడ్యుయేట్ నని ప్రయాణీకుల సానుభూతి పొందడం సరికాదనిపించింది. కొడుకు ఆటో నడుపుతున్నాడంటే గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న తండ్రికి కూడా తలకొట్టేసినట్టు ఉండేది. దాంతో ఆ అక్షరాలను చెరిపేశారు. అర్ధ రాత్రి పూట ఆటో కోసం ఒక వంటరి యువతి వస్తే, డ్రైవర్లంతా ఎలా వెంటబడింది, ఆ యువతిని క్షేమంగా ఆమె ఇంటికి తీసుకెళుతుంటే కొందరు పోకిరీలు మోటారు బైకులపై ఎలా వెంబడించింది, చివరికి ఆమెను క్షేమంగా ఇంట్లో దిగబెట్టిన చక్రధరే, అర్ధ రాత్రి మరొక యువతి కోమలిని ఇంట్లో దిగబెట్టాక,

‘ఇంత రాత్రి ఏం వెళతారు, రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దున్నే పోండి’ అన్న మాటలకు ఆ రాత్రి ఆమె గురించి ఏదేదో ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుని, పొద్దు న్నే తన ఆలోచనలకు సిగ్గుతో తలదించుకోవడం ఒక వైవిధ్యం. ‘మోహరాగం’ మంచి కథలాంటి వాస్తవ సంఘటన. ఆ ‘కోమలి ఆహ్వానంలో ఏ దోషమూ లేదు. దోషమంతా నా చూపులోనే ఉం ది. నా ఆలోచనలోనే ఉంది’ అన్న చక్రధర్ మాటలు ఆయన నిజాయితీని పట్టిస్తాయి. స్త్రీ పురుషుల మద్య పరస్పర ఆకర్షణ సహజం. ‘మగబుద్ధి’ లాగానే ‘ఆడబుద్ధి’ కూడా ఉంటుంది. మ గ చూపు లాగానే ఆడ చూపూ ఉంటుంది. మగవారికి మగబుద్ది కాకుండా ఆడ బుద్ధి ఉంటే అనుమానించాలి. అలాగే ఆడవారికి మగ బుద్ధి ఉన్నా లోపంగా భావించాలి. సహజ లక్షణాలను వ్యక్తీకరించడంలో చక్రధర్ ఎక్కడా వెనుకాడలేదు. వారి ఆటో నెంబరు, ఎం.ఏ., పరీక్షల హాల్ టికెట్టు నెంబరు ఒకటే కావడం కాకతాళీయం. అది కలిసొచ్చిన అంకెగా భావించారు. అదే సమయంలో ‘నమ్మకాలకు రూలేమీ చెప్పలేం. అలా అని కాదని కొట్టేయలేం’ అనే వీరికి సంఖ్యాశాస్త్రంపైన ఎటూ చెప్పలేని సందిగ్ధాలు ఉన్నాయి.

సహజంగా ఆటోలో ప్రయాణీకుడు కాలు మోపగానే అతను ఎవరు, ఏ పనిమీద ఎక్కడికి వెళుతున్నాడన్న వివరాలు రేఖా మాత్రంగా నైనా డ్రైవర్‌కు తెలిసిపోతాయి. ఆటో ఎక్కిన తన అభిమాన రచయిత నోట్లోంచి గుప్పున మందు వాసన రావడం, అతను ఆ రాత్రి ఒక మహిళతో గడపడం గమనించాక, ‘ఒక మంచి రచయితలో అన్నీ మంచి లక్షణాలే ఉండాలని రూలేమైనా ఉందా? అతడి వ్యక్తిత్వాన్ని గురించి గొప్పగా ఎవరు ఊహించుకోమన్నారు’ అని చక్రధర్ తనను తాను ప్రశ్నించుకుంటారు. కొందరు ప్రయాణీకులు ఆటోలో కొంత దూరం వచ్చి వెయిట్ చేయమని, గంటలు గడుస్తున్నా కనిపించకపోవడం వంటి చేదు అనుభవాలు, తన ఆటో ఎక్కిన ఒక ప్రేమ జంటను పెద్దలు ఎలా విడదీసి ఆమెకు వేరే పెళ్ళి చేసింది వంటి సంఘటనలు, రౌడీల కట్టడికి పోలీసు చర్యకు ఎలా సహకరించింది, ఆయిల్ కొనుగోలులో మోసాలు, డ్రైవర్లతో గొడవలు, బాహాబాహీకి దిగాల్సి రావడం వంటి సంఘటనలు చాలా ఆసక్తికరం.

ఆటో ఎక్కి రాత్రంతా ఆ ఊరు, ఈ ఊరు అంటూ తిరిగి, చివరికి డబ్బులు లేవనే ప్రయాణీకుడి బట్టలు విప్పించి టవల్‌తో అతన్ని పంపించేసిన సంఘటన చక్రధర్‌ను చిరకాలం వేధించింది. తానెందుకు అడ్డుకోలేకపోయానని ఆత్మపరిశీలన చేసుకున్నారు. సహజంగా ప్రయాణికులను తీసుకెళ్ళే ఆటోల్లో శవాలను తరలించరు. ఒక పేద రైతు తన మనవడి శవాన్ని గ్రామానికి తరలించడానికి ఏ అంబులెన్స్‌ను అడిగినా ఎక్కువ డబ్బులు అడుగుతున్న సమయంలో చక్రధర్ తన ఆటోలో తరలించడం కదిలించే సంఘటన. ఇటీవల తిరుపతి రుయాలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు ఒక కూలీ తన కొడుకు శవాన్ని భుజాన వేసుకుని 90 కిలో మీటర్లు మోటారు సైకిల్‌పైన తీసుకెళ్ళిన సంఘటన ఈ పుస్తకంలో గుర్తు చేశా రు. ఎప్పుడో నాలభైఅయిదేళ్ళక్రితం ఉన్న దయనీయమైన పరిస్థితులు ఇప్పటికీ మారలేదనడాని కి ఈ సంఘటన సజీవ ఉదాహరణ. ఇలా అనేక వాస్తవ సంఘటనల, అనుభవాల సమాహారంగా వెలువడిన గోవిందరాజు చక్రధర్ ‘గ్రాడ్యుయేట్ ఆటో సర్వీస్’ ఒక మంచి పుస్తకం. దీని కోసం ఫోన్ నెం. 9849870250కు సంప్రదించవచ్చు.

రాఘవ శర్మ,
94932 26180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News