Sunday, January 19, 2025

ఎంఎల్‌సి ఎన్నికలో తీన్మార్ జోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లగొండ ఉమ్మడి వరంగల్, జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను రేపుతోంది. పూర్తిస్థాయి ఫలితం తేలేందుకు రెండురోజులు పట్టనుంది. అధికారులు, సిబ్బంది ఎంత హడావుడి చేసినా కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగానే సాగుతోంది. 52మంది అభ్యర్థులు పోటీ లో ఉండటంతో జంబో బ్యాలెట్ పేపర్ ఇవ్వడం తో మరింత ఆలస్యం అవుతుంది. రాత్రి పదిగంటలకు మొదటిప్రాధాన్యత ఓటు తొలిరౌండ్ లెక్కిం పు ఫలితం వచ్చింది. తొలిరౌండ్‌లో 96వేల ఓట్ల లెక్కింపు పూర్తయితే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మ ల్లన్న 11వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రెండోస్థానంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి కొనసాగుతున్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్లే చెప్పాలి. మొదటిప్రాధాన్యత ఓటు లెక్కించేందుకే గురువారం ఉదయం వరకు పట్టనుంది. తొలిప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే ఎ లిమినేషన్ రౌండ్ ప్రారంభించాలి. అదేజరిగితే గురువారం అర్థరాత్రి వరకు పట్టనుందని అధికారులు చెపుతున్నారు. అధికారులు, కౌంటిం గ్ సి బ్బంది షిఫ్ట్‌లవారీగా లెక్కింపు చేపడుతున్నారు. నిరంతరంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన దాసరి దగ్గరుం డి కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందికి, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News