Monday, January 20, 2025

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్: తీన్మార్ మల్లన్న ముందంజ

- Advertisement -
- Advertisement -

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 96వేల మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న7,670 ఓట్ల మెజార్టీతో ఆధిక్యం సాధించారు. మొత్తం నాలుగు రౌండ్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఇప్పటివరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం మూడో రౌండ్ కొనసాగుతోంది. అయితే, చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల్లోగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న, బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య పోటీ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News