Monday, January 20, 2025

రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం(మే 27) జరగనుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

వచ్చే నెల 5న ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా రేపు ప్రత్యేక సెలవు ప్రకటించింది సీఈసీ. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నిన్న సాయంత్రం 5 గంటలకు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. దీంతో మూడు జిల్లాలో రేపు సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాప్స్‌ బంద్ కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News