- Advertisement -
రాష్ట్రంలో వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8 గంటల పోలింగ్ మొదలైంది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మూడు ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు.. ఎంఎల్‌సి ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల స్థానాల ఎన్నికల కోసం మూడు జిల్లాల్లో 191 మండలాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో మొత్తం 52 అభ్యర్థులు ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
- Advertisement -