హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 16న ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎంఎల్‌సి స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటు, మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎంఎల్‌సి నామినేషన్ లకు ఫిబ్రవరి 23గడువు తేదీగా ఎన్నిలక కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 24న నామినేషన్ ల పరిశీలను ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు విధించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మార్చి 22వరకు ఎంఎల్‌సి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. అయితే పట్టభద్రుల ఎన్నికలను అన్ని పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. అటు ఎపిలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Graduate MLC Election Schedule Release