Friday, December 20, 2024

ముగిసిన గ్రాడ్యుయేట్ ఎంఎల్ సి పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎంఎల్ సి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4.00 గంటలకు ముగిసింది. అయితే క్యూలైన్ లో మిగిలి ఉన్నవారికందరికీ ఓటేసే అనుమతిచ్చారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు జూన్ 5న జరుగనున్నది. మూడు జిల్లాల్లో మొత్తం 463839 మంది ఓటర్లు ఉండగా, 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు  చేశారు. ఈ ఎన్నికను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. 800 మంది ఓటు హక్కును వినియోగించే విధంగా ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News