- Advertisement -
కేంద్రంపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిత్యం పెంచుకుంటూ పోతున్న పన్నులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, హోటల్ గదుల అద్దెపై పన్నులు పెంచడంతోపాటు బ్యాంకు చెక్కుల జారీపై అధిక చార్జీలను కేంద్ర ప్రభుత్వం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాన మంత్రి మొదలుపెట్టిన ”గబ్బర్ సింగ్ ట్యాక్స్” ఇప్పుడు ”గృహస్తు సర్వనాశన ట్యాక్స్”గా రూపాంతరం చెందుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆహార పదార్థాలు, చదువులు, హోటల్ బస వంటివి ఇక మరింత ప్రియం కానున్నట్లు తెలియచేసే వార్తాకథనాన్ని రాహుల్ ఉటంకించారు. గతంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జిఎస్‌టి)ను ”గబ్బర్ సింగ్ ట్యాక్స్”గా అభివర్ణించారు.
- Advertisement -