Monday, December 23, 2024

లక్ష్యాన్ని మించి ధాన్యం సేకరణ

- Advertisement -
- Advertisement -

TS Govt will Buy Grain Even Difficulties Occurs Says Minister Gangula

6872 కొనుగోళ్ల కేంద్రాలతో 13,690 కోట్ల విలువ గల ధాన్యం సేకరణ
12.78 లక్షల మంది రైతుల వద్ద నుంచి సేకరించాం
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా సిఎం కెసిఆర్ చొరవతో ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందన్నారు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సేకరించిన 593 లక్షల మెట్రిక్ టన్నుల్లో 70 లక్షల మెట్రిక్ టన్నులతో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ప్రతి గింజా కొనాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు గతేడాది కన్నా దాదాపు 44 శాతం అధికంగా 21.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా సేకరించామని, దాదాపు 70 లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించి కేంద్రం నిర్దేశించిన దానికన్నా 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా సేకరించామన్నారు.

కరోనా సమయంలో సైతం అత్యధికంగా 6872 కొనుగోళు కేంద్రాల ద్వారా 13,690 కోట్ల విలువగల ధాన్యాన్ని 12.78 లక్షల మంది రైతుల నుంచి సేకరించామన్నారు. వారంలోగా రైతుల ఖాతాల్లోకి నగదును బదిలిచేస్తున్నామన్నారు. గతం కన్నా 5 కోట్ల అధిక గన్నీ సంచుల్ని సకాలంలో అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలతో అక్కడక్కడా తేమకు సంబంధించిన ఇబ్బందులు మినహా ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించామన్నారు. అక్కడక్కడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని సైతం తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు, కాళేశ్వర జలాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతోనే ఇదంతా సాధ్యమయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News